ఈ నాలుగు చిత్రాలు ఒకే రోజు ఓటిటిలో విడుదల..సినీ ప్రియులు తగ్గేదేలే
on May 8, 2025
ఓటిటి ప్రేక్షకులకి ఈ రోజు కావాల్సినంత సినీ వినోదం అందనుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఓటిటి వేదికగా ఈ రోజు విడుదల కానున్నాయి. పైగా వేటికవే డిఫరెంట్ కథలతో కూడిన సబ్జెట్స్ కావడంతో ఓటిటి ప్రియులకి సరికొత్త సినీ పండుగ వచ్చిందని చెప్పవచ్చు. మరి ఆయా చిత్రాల లిస్ట్ చూద్దాం.
శివశక్తి గా తమన్నా ప్రధాన పాత్రలో కనపడగా, సంపత్ నంది రచనా, దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన మూవీ ఓదెల 2(Odela 2). ఇప్ప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 17 న థియేటర్స్ లోకి అడుగుపెట్టగా హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ 'జాక్'. ఏప్రిల్ 10 న థియేటర్స్ లోకి అడుగుపెట్టగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా జాక్ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అజిత్ వన్ మాన్ షో 'గుడ్ బాడ్ అగ్లీ'(Good Bad Ugly)కూడా ఈ రోజే నుంచే తమిళం, హిందీ, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 10 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi) కూడా 'ఈటీవీ విన్' వేదికగా ఈ రోజు నుంచే అందుబాటులోకి రానుంది. ఈ విధంగా నాలుగు వైవిధ్యమైన చిత్రాలు ఒకే రోజు ఓటిటిలో అడుగుపెట్టి మూవీ లవర్స్ లో సరికొత్త సినీ జోష్ ని తెచ్చాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
