ఈ వారం థియేటర్, ఓటీటీలో వినోదాల విందు.. సినీ ప్రియులకు పండగే!
on Nov 24, 2025

ఈ వారం సినీ ప్రియులకు ఓ వైపు థియేటర్లలో రిలీజ్ లు, రీ రిలీజ్ లు.. మరోవైపు ఓటీటీలో సినిమాలు, సిరీస్ లతో వినోదాల విందు బాగానే అందనుంది.
నవంబర్ 27న 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka)తో రామ్ పోతినేని ప్రేక్షకులను పలకరించనున్నాడు. పి. మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఓ అభిమాని కథగా వస్తున్న ఈ చిత్రం.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన 'రివాల్వర్ రీటా'(Revolver Rita) నవంబర్ 28న విడుదలవుతోంది. అదే రోజు ధనుష్, కృతి సనన్ నటించిన బాలీవుడ్ చిత్రం 'తేరే ఇష్క్ మేన్' తెలుగులో 'అమరకావ్యం' పేరుతో విడుదల కానుంది. అలాగే నవంబర్ 28న స్కూల్ లైఫ్, జనతా బార్, మరువ తరమా వంటి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'బిజినెస్ మేన్' (Businessman) నవంబర్ 28న రీ-రిలీజ్ అవుతోంది.
ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు అలరించనున్నాయి.
నెట్ ఫ్లిక్స్:
జింగిల్ బెల్ హైస్ట్ మూవీ - నవంబర్ 26
సన్నీ సంస్కారి కి తులసి కుమారి హిందీ మూవీ - నవంబర్ 27
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 - నవంబర్ 27
ఆర్యన్ మూవీ - నవంబర్ 28
ది స్ట్రింగర్ డాక్యుమెంటరీ - నవంబర్ 28
అమెజాన్ ప్రైమ్ వీడియో:
కాంతార చాప్టర్ 1 మూవీ (హిందీ) - నవంబర్ 27
జియో హాట్ స్టార్:
బెల్ ఎయిర్ సీజన్ 4 - నవంబర్ 25
బోర్న్ హంగ్రీ డాక్యుమెంటరీ ఫిల్మ్ - నవంబర్ 28
జీ5:
ది పెట్ డిటెక్టివ్ మళయాలం మూవీ - నవంబర్ 28
రక్తబీజ్ 2 బెంగాలీ మూవీ - నవంబర్ 28
Also Read: స్పిరిట్ మూవీ లాంచ్.. ఈ స్టార్ వారసులను గుర్తుపట్టారా..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



