'ఒకే ఒక జీవితం'.. రోజురోజుకి పెరుగుతున్న వసూళ్ళు
on Sep 12, 2022

శర్వానంద్, రీతు వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఒకే ఒక జీవితం'. అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్ తో రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటున్న ఈ మూవీ హిట్ దిశగా పయనిస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం'.. మొదటిరోజు 75 లక్షల షేర్ రాబట్టగా, రెండోరోజు రూ.1.10 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.37 కోట్ల షేర్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రోజుల్లో రూ.3.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా నైజాంలో 1.65 కోట్ల షేర్(బిజినెస్ 2.5 కోట్లు), సీడెడ్ లో 24 లక్షల షేర్(బిజినెస్ 80 లక్షలు), ఆంధ్రాలో 1.33 కోట్ల షేర్(బిజినెస్ 3.20 కోట్లు) రాబట్టింది.
రెస్టాఫ్ ఇండియా 40 లక్షల షేర్, ఓవర్సీస్ లో 1.10 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.4.72 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా రూ.7.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు రూ.1.30 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.55 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.87 కోట్ల షేర్ రాబట్టి, బ్రేక్ ఈవెన్ కి ఇంకా 3 కోట్ల దూరంలో ఉంది.
దగ్గరలో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం 'ఒకే ఒక జీవితం' చిత్రానికి కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమాకే ఓటేసే అవకాశం ఉండటంతో వచ్చే వీకెండ్ నాటికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశముంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



