పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్.. అటు 'OG', ఇటు 'PKSDT'
on May 18, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఓజీ' మొదటి షెడ్యూల్ ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ రెండో షెడ్యూల్ మొదలైంది.
ముంబైలో పవర్ ఫుల్ షెడ్యూల్ తర్వాత, 'ఓజీ' రెండవ షెడ్యూల్ ఈరోజు(మే 18) హైదరాబాద్‌లో ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్ స్క్రీన్ పై గ్యాంగ్ స్టర్ గా తమ అభిమాన హీరోని చూడటం కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ సైతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తుండటం వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా రవి కె.చంద్రన్ వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 'ఓజీ'తో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'PKSDT'(వినోదయ సిత్తం రీమేక్) సినిమాలలో నటిస్తున్నాడు పవన్. ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదలై ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఈరోజు 'ఓజీ' రెండవ షెడ్యూల్ మొదలైంది. అలాగే ఈరోజు సాయంత్రం 'PKSDT' టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ కానున్నాయి. ఇలా వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాడు పవర్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



