'గేమ్ ఛేంజర్' లాస్ ని పవన్ కళ్యాణ్ కవర్ చేస్తాడా..?
on Aug 26, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టార్డంకి తగ్గ సంచలన వసూళ్లు రాబట్టగల సత్తా ఈ సినిమాకి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ఓజీ' మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్ల దాకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల రైట్స్ ని ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్, దిల్ రాజుకి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో 'వకీల్ సాబ్' సినిమా వచ్చింది. అలాగే పవన్ నటించిన పలు సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను పొందారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో దిల్ రాజే చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' రైట్స్ కూడా దిల్ రాజుకి దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న హైప్ ని బట్టి చూస్తే.. ఆయన భారీ లాభాలను చూడటం ఖాయంగా కనిపిస్తోంది. (OG Movie)
నిర్మాతగా ఈ ఏడాది దిల్ రాజు మిక్స్డ్ ఫలితాలను చూశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ నష్టాలతో డిజాస్టర్ గా నిలవగా.. అదే సమయంలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' మాత్రం భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక జూలైలో విడుదలైన 'తమ్ముడు' మూవీ పరాజయం పాలైంది. బడ్జెట్ ఎక్కువ కావడంతో 'గేమ్ ఛేంజర్'తో దిల్ రాజు భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నష్టాలను 'ఓజీ' కవర్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



