అభిమానులని ఉద్దేశించి ఎన్టీఆర్ తాజా ట్వీట్.. తెలిసాక గోల గోల చెయ్యకండి
on Oct 15, 2024
సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదలైన దేవర(devara)తన విజయపరంపరని కొనసాగిస్తూనే ఉంది చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డ్స్ ని సృష్టించటంతో పాటుగా రీసెంట్ గా ఐదువందల కోట్ల క్లబ్ లో చేరి ఎన్టీఆర్(ntr)స్టామినాని మరోసారి చాటి చెప్పింది. దీంతో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పలువురికి కృతజ్ఞతలు తెలిపాడు.
దేవర పార్ట్ 1 కి అందుతున్న అద్భుతమైన స్పందనకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు తమ పాత్రలకు ప్రాణం పోసి,మా కథకు జీవం ఇచ్చారు. మరియు ఇతర నటీనటులు కూడా బాగా నటించారు. అందరకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కథను సృష్టించిన కొరటాల శివ(kortala siva)గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి,సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారి వీఎఫ్‌ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇలా అందరు కలిసి మా చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
విజయవంతంగా ప్రదర్శించడానికి కారణమైన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు కూడా ధన్యవాదాలు.అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు.మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా రూపొందించినందుకు కూడా ధన్యవాదాలు.ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు,నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలాజరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.దేవర ని మీ భుజాలపై మోశారు.మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.తమ అభిమాన హీరో పేరు పేరున అందరకి ధన్యవాదులు చెప్పడంతో అభిమానులు ఎన్టీఆర్ సంస్కారానికి హాట్స్ ఆఫ్ చెప్తున్నారు.
Also Read