ENGLISH | TELUGU  

హైదరాబాద్ ఫిలింనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సినీ రాజకీయనాయకుల నివాళులు  

on Jan 18, 2025

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు(Ntr)గారు స్వర్గస్తులయ్యి  నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు  రామారావు గారికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ను స్మరించుకోవడం జరిగింది. 

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ"నేను ఎన్టీఆర్ గారికి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం.నమ్ముకున్న వారెవరిని కూడా ఎన్టీఆర్ గారు వదులుకోలేదు.వాళ్లంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు.అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. సినిమాకి మాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఇంటికి వెళ్తే కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు.అలాంటి 
 వ్యక్తి అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు.మరోసారి అన్నగారు తెలుగు గడ్డమీద పుట్టి,మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది.

ఒకప్పటి హీరో నిర్మాత మాదాల రవి మాట్లాడుతు"దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈరోజు తెలుగువారి గురించి మాట్లాడుతున్నారంటే  దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు. ఒకవైపు ఓ కథానాయకుడిగా ఆయన చేసిన పాత్రలు, అలాగే మరోవైపు ప్రజా నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పనులు అందరికి తెలిసినవే. అటువంటి మహానుభావుడికి భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాలి.ఆ దిశగా మనం పోరాటం చేయాలని అన్నాడు. 

ఎన్టీఆర్ మనవరాలు నందమూరి రూప మాట్లాడుతు "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ మన ఆలోచనల్లో ఉంటారు.ఆయన మరణం లేని వ్యక్తి. ఎన్నో సినిమాలలో బ్రహ్మాండమైన పాత్రలు పోషించిన ఒక దృవతార.ఎన్నో దైవ పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక వ్యక్తి.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోని ప్రభుత్వాన్ని స్థాపించిన వ్యక్తిగా నిలిచాడు.ప్రజలకు అత్యవసరమైన కూడు, గుడ్డ, నీడను అందరికీ అందేలా చేశారు.ఒక నటుడిగా,రాజకీయ నాయకుడిగా కంటే కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే ఒక మహానుభావుడిగా ప్రజలు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు.ఆడవారికి ఆస్తి హక్కులను కూడా సమానంగా ఉండేలా చేశారు. మా తాత గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నానని చెప్పింది  

ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతు "ఈరోజు నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికమైన మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ మాత్రం మన చుట్టూనే ఉంటుందని, సూర్య చంద్ర ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుంది. ఆయన సినీ రంగంలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా పెను తుఫాను సృష్టిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆడవారికి ఆస్తి హక్కుల దగ్గర నుండి రెండు రూపాయలకు కిలో బియ్యం కొరకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి సత్తా చూపించారు. అది మనం అదృష్టంగా భావించాలి. ఎన్టీఆర్ గారు చేసిన సేవలను గుర్తించి ఆయనను భారతరత్నతో సత్కరించాలని విన్నపించుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు" అన్నారు. 

బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడుతు "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్లో ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారం. ఎన్టీఆర్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ గమనించదగిన వ్యక్తి. ఎన్టీఆర్ గారికి ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు అప్పటినుండి ఆయనతో మా ప్రయాణం మొదలైంది. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని బాధ్యతగల పదవులు అప్పగించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన జరిగింది. నిన్ను చూపుతో హైదరాబాదును అభివృద్ధి చేసే ప్రతి పనిలోనూ ఆయన దగ్గర ఉండి అభివృద్ధి పనులు చూసుకునేవారు. ఆయన 35 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలను నేడు వేరే పేర్లతో దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుంది. అంత ముందు చూపు ఉన్న వ్యక్తి తారక రామారావు గారు. కాషాయి వస్త్రాలతో రాజకీయాల్లో ఉండి ఆ రోజుల్లో దేశం మొత్తం తిడుతున్న వ్యక్తి ఆయన. పార్టీ పెట్టి 9 నెలలోనే అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేందుకు మనమంతా పడటం చేయాలి" అన్నారు. 

తెలుగు చిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న గారు మాట్లాడుతూ... "తెలుగువారింటనే చిన్న చూపు చూసే రోజుల్లో కేవలం 9 నెలలలో రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకుని తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగువారు ఒక ప్రభంజనంలా వెలుగెత్తడానికి కారణం ఎన్టీఆర్. ఇప్పుడు పని చేసిన వాళ్ళు వచ్చిన ఏమో కానీ ఆయన ఆరో సినిమా పాతాళ భైరవి ఆ రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో 175 రోజులు ఆడింది. ఆయన జీవితం అంతా తెలుగువారికి అంకితం చేసిన మహానుభావుడు. నేను హైదరాబాదులో ఉండే పార్టీ పెట్టారు, సీఎం అయ్యారు, అలాగే శివైక్యం చెందారు. తెలంగాణకు ఎంతో చేశారు. పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుచేసి కేవలం అక్రవర్ణాలు చేతుల్లోని అధికారం కాకుండా బడుగు బలహీన వర్గాలు కూడా అధికారంలో ఉండాలని ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రజలందరికీ ఉపయోగపడేలా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశ పెట్టడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఒక సంఘసంస్కర్తగా శివైక్యం చెంది 29 సంవత్సరాలు పూర్తయిన కూడా తలుచుకుంటున్నాము. ఆయన మరణం లేని వ్యక్తి" అంటూ ముగించారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.