మహేష్‌కు షో కాజ్ నోటీసులు!!
on Feb 20, 2019

మహేష్ బాబు ఇటీవల హైదరాబాద్ లో లో ఏఎమ్ బి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియెటర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యాయి. వరల్డ్ క్లాస్ రేంజ్ లో థియేటర్స్ ఉండటంతో టికెట్ ధర కూడా అదే స్థాయిలో పెంచారు. దీంతో ఇప్పుడు ఇది సమస్యగా మారి మహేష్ కు షో కాజ్ నోటీసులు పంపించారట జిఎస్టీ అధికారులు. ఒకసారి వివరాల్లోకి వెళితే....గతంలో టికెట్ ధర రూ.100కు పైగా ఉన్న థియేటర్స్ లో జిఎస్టీ టాక్స్ ను 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. కానీ, ఇప్పుడు ఆ టాక్స్ ను 18 నుంచి 12 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గించిన ఈ టాక్స్ జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కానీ , మహేష్ మాత్రాం ఏఎమ్ బి సినిమాస్ లో జిఎస్టీకి అనుగుణంగా టికెట్ ధరలు తగ్గించక పోవడంతో అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మహేష్ కు జిఎస్టీ కు మధ్య పెద్ద రచ్చే జరిగింది. 2007-8 ఏడాదికి సంబంధించి కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేశాడు. కానీ , దానికి పన్ను కట్టలేదంటూ రెండు బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసిన సంగతి తెలిసింది. మెల్లగా ఆ సమస్య సద్దుమణిగే సమయంలో జిఎస్టీ వారు మరో షాక్ ఇచ్చారు ప్రిన్స్ కు. మరి దీన్ని ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



