అతను నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు!
on Aug 7, 2022

ఆరేళ్లుగా తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 30కి పైగా వేరు వేరు నెంబర్లు నుంచి కాల్ చేసి విసిగించాడని, తన పెళ్లి గురించి వార్తలు రావడానికి కూడా ఆ వ్యక్తే కారణమని చెప్పింది.
నిత్యా మీనన్ త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ వార్తలను ఖండించిన నిత్యా.. మరోసారి పెళ్లి వార్తలపై స్పందించింది. తన పెళ్లి గురించి వార్తలు రావడానికి సంతోష్ వర్కీ అనే యూట్యూబర్ కారణమని తెలిపింది. "ఆరేళ్ళుగా అతను నన్ను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. నా తల్లితండ్రులకు కూడా కాల్స్ చేసి విసిగించేవాడు. ఇంట్లో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే, అతని మెంటల్ కండిషన్ బాగోలేదేమో అని వదిలేద్దాం అన్నాను. దాదాపు 30 ఫోన్ నెంబర్లు బ్లాక్ చేశాను. అయినా అతని తీరు మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు" అంటూ తాజాగా 19(1)(A) మూవీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది నిత్యా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



