నితిన్ భార్య డెలివరీ అయ్యింది.. ఫ్యాన్స్ సంతోషం
on Sep 6, 2024

నితిన్(nithiin)2002 లో తేజ దర్శకత్వంలో వచ్చిన జయంతో హీరోగా పరిచయమయ్యి తన కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. అభిమాన గణం కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు ఆ అభిమానుల ముందుకు బుల్లి నితిన్ వచ్చాడు.
నితిన్ భార్య షాలిని కొంత సేపటి క్రితం పండంటి మగ బిడ్డని ప్రసవించింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపిన నితిన్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని కూడా చెప్పాడు. దీంతో అభిమానులు నితిన్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. నితిన్, షాలిని ల వివాహం 2020 లో జరిగింది. నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాతో పాటు రాబిన్ హుడ్ అనే మరో సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.2020 లో వచ్చిన భీష్మ తర్వాత ఇంతవరకు నితిన్ కి సరైన హిట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



