నిషా కి కొట్టిన ఛార్మి
on Sep 6, 2013
మంత్ర, మంగళ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు ఓషో తులసీరాం మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఓషో తులసీరాం దర్శకత్వంలో నిషా కొఠారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి "క్రిమినల్స్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ చిత్ర ముహూర్తం షాట్ కు హీరోయిన్ ఛార్మి క్లాప్ ఇచ్చింది. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.