బ్యాన్ చెయ్యండి..నిఖిల్ పోస్ట్ వైరల్
on May 14, 2025

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్(Nikhil)ప్రస్తుతం 'స్వయంభు'(Swayambhu)అనే చారిత్రక నేపధ్యంతో కూడుకున్న సినిమాలో చేస్తున్నాడు. నిఖిల్ ఫస్ట్ టైం ఒక యోధుడుగా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా 'స్వయంభు' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
రీసెంట్ గా నిఖిల్ ఎక్స్(x)వేదికగా పోస్ట్ చేస్తు 'భారత్(Bharath)పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న వేళ టర్కీ(Turkey)అధ్యకుడు ఎర్డోగాన్(Recep Tayyip Erdoğan)పాకిస్థాన్ తో సత్సబంధాలు కొనసాగిస్తామని చెప్పాడు. పాక్ ఉగ్రవాదుల చేతుల్లో అన్యాయంగా బలైన మన వాళ్ళకి కనీసం సంతాపం తెలపలేదు. కాబట్టి మన వాళ్ళు టర్కీ వెళ్లకండా ఉండటంతో పాటు, మన దేశానికీ వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ కోసం డబ్బు ఖర్చు పెట్టడం మానుకోండని చెప్పుకొచ్చాడు.
టర్కీ నుంచి మనదేశానికి అనేక వస్తువులతో పాటు పండ్లు దిగుమతి అవుతుంటాయి. మన దేశం నుంచి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున టర్కీ వెళ్తుంటారు. దీంతో టర్కీ ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. 'బాయ్ కాట్ టర్కీ' అనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



.webp)
