మెగా హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్దం!!
on Sep 24, 2015
.jpg)
ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాత గా రామరాజు దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య సరసన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు .
గతంలో “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ” వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామరాజు ఈ చిత్రానికి ఓ కొత్త కథనంతో మరో ప్రేమ కథను మనకి అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… “TV9 తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రామరాజు చాలా అద్భుతమైన కథను అందించారు, హీరో నాగ శౌర్య తో పాటు హీరోయిన్ గా మెగా ఫ్యామిలి వారసురాలు కొణిదెల నిహారిక ను పరిచయం చేస్తున్నాం. TV9 వంటి ప్రముఖ సంస్థ చిత్ర నిర్మాణం లోకి అడుగు పెట్టడం మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి పరిణామం” అని అన్నారు .
ఈ చిత్రానికి A. అభినయ్, డా. కృష్ణ భట్ట సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



