వీరమల్లు విషయంలో పవన్ కి ఫ్యాన్స్ సలహా.. ఆ పని చేసి తమ సంతోషాన్ని తీర్చాలి
on May 22, 2025

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో మూవీ' హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)జూన్ 12 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఎన్నో రిలీజ్ డేట్ వాయిదాల తర్వాత వీరమల్లు వస్తుండంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసారు. అందులో భాగంగా నిన్న థర్డ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి,మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ ఈవెంట్ కి పవన్ హాజరు కాలేదు.
దీంతో రిలీజ్ డేట్ వరకు జరిగే ప్రమోషన్స్ కి పవన్ వస్తాడా అనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది. ఎందుకంటే పవన్ తన మరో మూవీ 'ఓజి' షూటింగ్ లో కొన్ని రోజుల నుంచి పాల్గొంటూ వస్తున్నాడనే సమాచారం ఫిలిం సర్కిల్స్ లో జరుగుతుంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రతి రోజు తన బాధ్యతలు నిర్వహిస్తు వస్తున్నాడు. ఈ విధంగా ఓజి షూటింగ్, రాజకీయాల పరంగా క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Keeravani)నిన్న జరిగిన ఈవెంట్ లో మాట్లాడుతు వీరమల్లు కి సంబంధించి త్వరలోనే మూడు భారీ ఈవెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాకపోతే పవన్ పాల్గొంటాడా లేదా అనే విషయాన్నీ వెల్లడి చెయ్యలేదు. ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం(Am rathnam)కూడా ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటాడా, లేదా అనే అనుమానాన్ని కొంత మంది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే త్వరలోనే జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం పవన్ హాజరవుతాడానే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అభిమానులు మాత్రం వీరమల్లు కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ లో పవన్ పాల్గొనాలని కోరుతున్నారు.
పవన్ తన కెరీరి లోనే ఫస్ట్ టైం చేస్తున్న ఈ చారిత్రాత్మక మూవీలో నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ కాగా, సత్యరాజ్, నర్గిస్ ఫక్రి ,నోరా ఫతేహి, విష్ణు సేన్ గుప్తా, రఘుబాబు, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఔరంగ జేబుగా బాబీడియోల్ కనిపిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వీరమల్లు తెరకెక్కగా జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో వీరమల్లు రిలీజ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



