నాని హిట్ 3 కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు
on Apr 30, 2025
నాచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో 'హిట్ 3'(Hit 3)మే 1 న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను(Sailesh KOlanu)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాని సరసన కేజిఎఫ్ భామ 'శ్రీనిధి శెట్టి'(Srinidhi Shetty)జత కట్టగా సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు.
ఈ మూవీ టికెట్ రేట్స్ పెంపుకి అనుమతిని ఇస్తు ఏపి ప్రభుత్వం(Ap Government)ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వులలో జిఎస్టి తో కలుపుకొని సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు, మల్టిప్లెక్స్ లలో డెబ్భై ఐదు రూపాయలు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే ఈ పెంపు ధరలు వారం రోజులు మాత్రమే ఉండేలా కూడా తన ఆదేశాల్లో పేర్కొంది.
హిట్ 3 రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నిడివితో తెరకెక్కగా సెన్సార్ వాళ్ళు 'A 'సర్టిఫికెట్ ని జారీ చెయ్యడం జరిగింది. ట్రైలర్, ప్రచార చిత్రాలతో హిట్ 3 పై నాని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
