విచారణలో షైన్ టామ్ చాకో సంచలన విషయాలు..హోటల్ లో ఆ అమ్మాయి ఉంది నిజమేనా!
on Apr 21, 2025
డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom Chacko)ని శనివారం నాడు విచారణకి పిలిపించిన పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో షైన్ పలు సంచలన విషయాలు చెప్పినట్టుగా మలయాళ చిత్ర పరిశ్రమలో కథనాలు వస్తున్నాయి.
షైన్ పోలీసులతో 'డ్రగ్స్(Drugs)వినియోగించే వారు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రతిసారి నా పేరే తెర పైకి వస్తుంది. కొంతమంది మధ్యవర్తుల నుంచి నాకు డ్రగ్స్ వచ్చేవి. అడిగితే షూటింగ్ కి కూడా తెచ్చిచ్చే వాళ్ళు. హోటల్ కి నాకు తెలిసిన అమ్మాయిని కలవడం కోసం వెళ్ళాను. కాకపోతే ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీ తో విబేధాలు ఉన్నాయి. వాళ్ళు హోటల్ కి గొడవపడటానికి వస్తున్నారేమో అనుకోని పారిపోయాను. నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)తో అసభ్యకరంగా ప్రవర్తించలేదని కూడా షైన్ పోలీసులతో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
షైన్ కొచ్చిలోని ఒక హోటల్ లో డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న సమాచారం రావడంతో నార్కెటిక్ బృందం హోటల్ కి వెళ్లడంతో, పోలీసులు వచ్చే ముందే మూడో అంతస్థులో ఉన్న షైన్ కిటికీ లో నుంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోయాడు. సోషల్ మీడియాలో కూడా పారిపోతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
