నవీన్ చంద్ర కొత్తది మొదలెట్టేశాడు
on Mar 12, 2014

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా ఓ సినిమా ప్రారంభమయ్యింది. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మిస్తున్నారు. అజయ్ వొద్దిరాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్త కార్యక్రమం నేడు హైదరాబాదులో జరిగింది. ముహూర్త సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నటుడు నవీన్ మాట్లాడుతూ... "అందాల రాక్షసి", "దళం", "నా రాకుమారుడు" చిత్రాల తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఫన్ లవింగ్ సినిమా ఇది. ఎనర్జిటిక్ గా సాగుతుంది" అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... "కమర్షియల్ లవ్ స్టొరీ ఇది. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



