నేచురల్ స్టార్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఫిక్స్!
on Aug 16, 2023

డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టాలీవుడ్ కథానాయకుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న సినిమా హాయ్ నాన్న. శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇది. తదుపరి నాని ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు నాని నెక్ట్స్ సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయ్యారు. ఆయనెవరో కాదు.. వివేక్ ఆత్రేయ.
నాని, వివేక్ ఆత్రేయ కలిసి పని చేయనుండటం ఇదేమీ తొలిసారి కాదు.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకే అంటే సుందరానికీ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. తనతో ఫ్లాప్ మూవీ చేసినప్పటికీ వివేక్ ఆత్రేయపై నమ్మకంతో నాని మరో సినిమా చేయటానికి రెడీ అయ్యారు. డీవీవీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. మరీ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తారా లేక తెలుగులోనే చేస్తారా? అనే దానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
దసరా సినిమాతో ఈ ఏడాది నాని బ్లాక్ బస్టర్ సాధించటమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరారు. ఆ సినిమాను దసరా మూవీని శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్‌తో చేయటం విశేషం. అలాగే హాయ్ నాన్న చిత్రానికి కూడా శౌర్యవ్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. కానీ నెక్ట్స్ సినిమాను మాత్రం వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు నాని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



