నారా రోహిత్ పెళ్లి డేట్ ఇదే.. స్పెషల్స్ ఇవే
on Oct 23, 2025

విభిన్నమైన చిత్రాల్లో నటించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తనకంటు ప్రత్యేక గుర్తింపుని పొందిన హీరో 'నారా రోహిత్'(Nara Rohith).ఈ ఏడాది భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. రోహిత్ కి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ప్రముఖ నటి 'సిరి లేళ్ల'(Siri lella)తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
వీరివురి వివాహం అక్టోబర్ 30న హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా జరగనుంది. రాత్రి 10 గంటల 35 నిమిషాలకి ముహుర్తాన్ని ఫిక్స్ చేసారు. వివాహ వేడుకల్ని ఐదు రోజుల పాటు జరపనున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 25న హల్దీ వేడుక, అక్టోబర్ 26 రోహిత్ ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం, 28న మెహందీ వేడుక, ఆ మరుసటి రోజు సంగీత్ ఉండబోతుంది. పెళ్లితో పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకి పలువురు సినీ వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
నారా రోహిత్, సిరి కలిసి ప్రతినిధి పార్ట్ 2 లో జంటగా నటించారు. గత సంవత్సరం మే 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిరి అసలు పేరు శిరీష కాగా స్క్రీన్ నేమ్ సిరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



