నా ఆలోచనలు వారి చుట్టూ తిరుగుతున్నాయి
on Aug 17, 2018

నాగార్జున, నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుంది.. ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న నాని కేరళ ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు.. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.. ఈ వరదల దాటికి ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.. అయితే ఈ విషయంపై స్పందించిన నాని ఆవేదన వ్యక్తం చేసారు.. ‘బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతోంది.. మా సినిమాటోగ్రాఫర్, అతడి బృందం కుటుంబ సభ్యులు కేరళలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాళ్లు ఇవాళ లొకేషన్‌లో ఏడవడం చూశా.. అక్కడి వారి పరిస్థితి గురించి విన్న తర్వాత చాలా బాధపడ్డా.. నా ఆలోచనలు కేరళ ప్రజల చుట్టూ తిరుగుతున్నాయి.. వారు సురక్షితంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మనకు వీలైన సహాయం చేసి, వారికి అండగా నిలుద్దాం’ అని నాని ట్వీట్ చేశారు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



