నాగార్జున స్థానంలో నాని!
on Jul 6, 2016
ఈమధ్యకాలంలో యంగ్ - సీనియర్ హీరో అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ భారీ డైలాగులు చెప్తూ, ఓ పదిమందిని గాల్లో ఎగరేస్తూ "మాస్ హీరో" ఇమేజ్ కోసం వెంపర్లాడేవారే. రోమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు చేసే హీరోలూ కరువయ్యారు. అందుకే ప్రస్త్తుతం ఇండస్ట్రీలో రోమాంటిక్ హీరోలు తక్కువయ్యారు. నాగశౌర్య మొదట్లో రోమాంటిక్ సినిమాలు చేసినప్పటికీ.. మధ్యలో "జాదూగాడు" అనే సినిమాలో నటించి చేతులు కాల్చుకొన్నాడు. కానీ.. మొదట్నుంచి యాక్షన్ కి దూరంగా ఉంటూ కేవలం రోమాంటిక్ లేదా కామెడీ ఎంటర్ టైనర్స్ ను మాత్రమే ఎంచుకోంటూ వచ్చాడు. ఇటీవల "జెంటిల్ మెన్"తో మరో హిట్ అందుకొన్న నాని ఇప్పుడు తెలుగులో ఉన్న ఏకైక రోమాంటిక్ హీరోగా రూపాంతరం చెందాడు. సో, ఇంతకు ముందు రోమాంటిక్ హీరో అంటే నాగార్జున గుర్తొచ్చేవారు, ఇప్పుడు ఆయనకి బదులుగా నాని పేరు వినిపిస్తుంది!