హీరోగా నాని నెక్స్ట్ సినిమా అదేనా?
on Sep 14, 2019

ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా సెట్ చేసుకోవడం నానికి అలవాటు. దాంతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతున్నాడు. ఎప్పుడూ నాని చుట్టూ ముగ్గురు నలుగురు దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడూ రెండు మూడు సినిమాలు లైనులో ఉన్నాయి. అందులో దర్శకుడు శివ నిర్వాణ సినిమా ముందు పట్టాలు ఎక్కుతుందని, సెప్టెంబర్ 13న విడుదలైన 'గ్యాంగ్ లీడర్' తర్వాత హీరోగా నాని నెక్స్ట్ సినిమా అదేనని సమాచారం. అదేంటి? మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్నాడు కదా అని కొందరికి సందేహం రావొచ్చు. అందులో నాని హీరో కాదు, విలన్ కదా! 'వి' షూటింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ లో శివ నిర్వాణ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించనున్నారు. 'నిన్ను కోరి'తో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. షైన్ స్క్రీన్స్ లో 'కృష్ణార్జున యుద్ధం' చేశాడు. అటు దర్శకుడితో... ఇటు నిర్మాతలతో నానికి ఇది రెండో సినిమా అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



