నాని... అప్పుల పాలైపోయాడా??
on Sep 5, 2015
.jpg)
యువ హీరో నాని అప్పుల పాలైపోయాడని, సినిమాలకు ఫైనాన్స్ చేసి చేసి దివాళా తీసేశాడని, ఆ అప్పులు తీర్చుకోవడానికి వరుసగా సినిమాలు చేస్తున్నాడన్న పుకారు ఫిల్మ్‌నగర్‌లో షికారు కొడుతోంది. రెండేళ్ల క్రితం డీ ఫర్ దోపిడీ సినిమాకి నిర్మాతగా నాని కార్డు టైటిల్స్ పడింది. ఆ సినిమా ద్వారా నాని భీకరంగా నష్టపోయాడని, దాంతో పాటు కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశాడని టాక్. దీనిపై నాని స్పందించాడు.
నాకు అప్పులేంటి? అంత అవసరం నాకేమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నాడు నాని. డీ ఫర్ దోపిడీకి తన పేరు నిర్మాతగా పడిన మాట వాస్తవమే అయినా, తాను ఆ సినిమా కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, సినిమాకి క్రేజ్ పెరగడానికి తన పేరు ఉపయోగపడుతుందని దర్శక నిర్మాతలు అడిగారని, తాను ఒప్పుకొన్నానని అంతే తప్ప తాను ఆ సినిమాకి నిర్మాతనేం కాదని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకూ తాను నటించిన ఏ సినిమాకీ ఆర్థికంగా సాయం చేయలేదని, అలాంటప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం తనకెందుకొస్తుందని అంటున్నాడు నాని. నాని స్టేట్ మెంట్ తో ఈ పుకారుకి పుల్ స్టాప్ పడినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



