ENGLISH | TELUGU  

నందమూరి తారకరామారావు సినిమా ప్రారంభం..ఎన్టీఆర్ దారినే ఎంచుకున్నాడు

on May 12, 2025

 విశ్వ విఖ్యాత నటసార్వభౌమ 'నందమూరి తారకరామారావు'(Nandamuri taraka ramarao)ముని మనవడు, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)పెద్ద అన్నయ్య జానకిరామ్(Janaki Ram)కుమారుడు తారకరామారావు(Taraka ramarao)హీరోగా అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. వైవిఎస్ చౌదరి(Yvs Chowdary)దర్శకుడు కావడంతో తారకరామారావు చేస్తున్న మొదటి సినిమాపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.

రీసెంట్ గా ఈ చిత్రం  పూజా కార్యక్రమాలతో  ప్రారంభమయ్యింది. ముఖ్య అతిధులుగా నారా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరి, రామకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనగా ముహూర్తం షాట్ కి భువనేశ్వరి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరు  మాట్లాడుతు తమ నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరో తారకరామారావుని ప్రేక్షకులు ఆదరించాలని, నటనలో తారకరామారావు అత్యున్నత శిఖరాలని అధిరోహించాలని అభిలషించారు.

ఇక వైవీఎస్ చౌదరి మాట్లాడుతు 1980 వ సంవత్సరం నేపధ్యానికి చెందిన కథతో మా చిత్రం తెరకెక్కనుంది. హైందవ సంస్కృతి, తెలుగుభాష గొప్పతనాన్ని చెప్పబోతున్నాం. ఈ  నేపధ్యమే అసలైన బలం అని చెప్పుకొచ్చాడు. ప్రముఖ కూచిపూడి డాన్సర్, తెలుగు అమ్మాయి వీణరావు(veena rao)హీరోయిన్ గా చేస్తుండగా బొమ్మరిల్లు సినిమాపై వైవిఎస్ చౌదరి అయన సతీమణి గీత అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.