ఎన్టీఆర్‌ను అందుకోవడం అసాధ్యం-పవన్ కళ్యాణ్
on Apr 5, 2016

తెలుగు సినిమాను శాసించే కొణిదెల-నందమూరి కుటుంబాల మధ్య ఎప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండేది. నటనలో కాని రికార్డుల్లో కానీ ఒకరితో ఒకరు ఢీకొడుతూ ఉండేవారు. ఎన్టీఆర్-చిరంజీవి, చిరంజీవి-బాలకృష్ణ ఇలా తరాలుగా ఇరు కుటుంబాల వారసులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తూ ఉండేవారు. అయితే ఇదంతా సినిమాల పరంగా మాత్రమే. బయట మాత్రం ఇరు కుటుంబాలు చాలా సన్నిహితంగా మెలుగుతాయి. ఒకరి ఇంట్లో శుభాకార్యాలకు ఒకరు హాజరువుతూ సినిమాలు వేరు స్నేహం వేరు అంటూ నిరూపించారు. తెలుగు సినిమాలో శిఖర సమానుడైన ఎన్టీఆర్‌కు సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా వీరాభిమానులున్నారు. వారిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి.
చిరంజీవికి అన్న నందమూరి తారక రాముడంటే ఎనలేని భక్తి, గౌరవం. ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్‌ను పోగిడేవారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలోనూ తనకు రాజకీయాల్లో స్పూర్తి ఎన్టీఆరే అన్నారు. ఇప్పుడు అదే దారిలో తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని హిందీలో రిలీజ్ చేస్తుండటంతో పవన్ ఇంటర్వ్యూల కోసం బాలీవుడ్ మీడియా క్యూ కట్టింది. అప్పట్లో అనుపమకు ఇంటర్వ్యూ ఇచ్చినలో చాలా సంగతులు చెప్పుకొచ్చాడు. తనకు స్టార్ డం మీద మమకారం కానీ ఇష్టం కానీ లేవని వివరించాడు. పాటల్లో,డ్యాన్సుల్లో నటించడానికి ఇబ్బంది పడతానని చెప్పాడు. అన్నయ్య మెగాస్టార్‌కు తాను వీరాభిమానిని అని అయితే క్రేజ్ విషయంలో ఆయన్ను అందుకోవడం సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. యాక్టింగ్ విషయంలో ఎన్టీఆర్‌ను ఆందుకోవడం అసాధ్యం అన్నారు. యాక్టింగ్‌లో ఎన్టీఆర్‌కి సాటి కానీ క్రేజ్‌లో చిరంజీవికి పోటీ కాని ఉండదని ఇలా తన మనసులో మాట చెప్పారు పవర్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



