ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరు..?
on May 22, 2024

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలొచ్చి అభిమానులను ఊరిస్తున్నాయి. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్లకు నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించనున్నాయని, మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశం కోసం తెరవెనుక వర్క్ జరుగుతోందట. ఇప్పటికే మోక్షజ్ఞ తన ఫిజిక్ ఫిట్ గా మలచుకునే ప్రయత్నంలో ఉండటమే కాకుండా.. నటనలోనూ మెళుకువలు నేర్చుకుంటున్నాడట. మరోవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం ఇప్పటికే బాలకృష్ణ కథ కూడా సెలెక్ట్ చేశారని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. దర్శకుడి ఎంపిక జరిగిపోయిందట.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల రానున్నాయి. ఈ హడావుడి అంతా ముగిశాక.. మంచి రోజు చూసి.. మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ ని అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. అదేరోజు దర్శకుడు పేరుని రివీల్ చేసే అవకాశముంది అంటున్నారు. సెప్టెంబర్ లో మోక్షజ్ఞ పుట్టినరోజు ఉంది. అప్పుడు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ సినిమాని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
మరి తన తనయుడు మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణ ఏ దర్శకుడికి అప్పగిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



