ఐబొమ్మ రవికి బిగ్ షాక్
on Jan 7, 2026

ఐబొమ్మ రవికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు
బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం
పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమంది రవికి బిగ్ షాక్ తగిలింది. అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు.
తాజాగా ఈ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



