అరేయ్... మీ పవర్ స్టార్ నా తమ్ముడ్రా!
on Sep 12, 2017

‘మా పవర్ స్టార్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావ్?’ అని నాగబాబుకి కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారట. నాగబాబేమో.. ‘అరేయ్... మీ పవర్ స్టార్... నా తమ్ముడు రా. వాడ్ని నేననక ఎవరంటార్రా’ అని సమాధానమిచ్చాడట. నిజంగా భలే ఉంది కదూ. స్వయంగా సొంత అన్నయ్యనే నిలదీయడం. నిజంగా ఫ్యాన్స్ చేసే పనులు ఒక్కోసారి అమాయకంగా అనిపిస్తాయ్. రీసెంట్ గా ఈ విషయాన్నే చెప్పుకొచ్చారు నాగబాబు. ‘ప్రతి ఫంక్షన్ లో కేకలేస్తారు. అది అన్నయ్య ఫంక్షన్ కావొచ్చు, బన్నీ ఫంక్షన్ కావొచ్చు. వాళ్లకు తేడా ఉండదు. పవర్ స్టార్.. పవర్ స్టార్. తప్పుకదా. అదే చెప్పాను. దానికి కొంతమందికి కోపం వచ్చింది. అయినా అదేం నేను పట్టించుకోను. అన్నయ్య ఫ్యాన్సూ, తమ్ముడు ఫ్యాన్సూ అందరూ మా ఫ్యాన్సే.
అందరూ మాకు ఒక్కటే’ అన్నారు నాగబాబు. బన్నీ ‘నేను చెప్పను బ్రదర్’ అన్న విషయం గురించి కూడా మాట్లాడారు నాగబాబు. ‘ఆ రోజు బన్నీ అలా అనకుండా ఉండాల్సింది. కానీ.. సహనం అనేది ఒకటుంటుంది. బహుశా బన్నీ సహనాన్ని కోల్పోయాడు. అందుకే అలా అన్నాడు. నిజానికి బన్నీ... పవన్ కి మంచి అభిమాని. తర్వాత తనే చెప్పాడు.. ఫ్రెండ్స్ మనం అందరం ఒక్కటే. ఇలా అల్లరి చేసుకోవద్దు. నేనూ పవర్ స్టార్ ఫ్యాన్ నే. మీలో ఒకడ్నే’ అని. ఏది ఏమైనా.. అభిమానులు కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాలి’అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాగబాబు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



