అల్లు అరవింద్, దిల్ రాజుల చిత్రం
on Feb 6, 2012
అల్లు అరవింద్, దిల్ రాజుల చిత్రం ప్రారంభం కాబోతూంది. వివరాల్లోకి వెళితే అల్లు అరవింద్ ఎటువంటి అనుభవమున్న నిర్మాతో అందరికీ తెలిసిందే. అలాగే దిల్ రాజు కూడా విజయవంతమైన, తెలివైన యువ నిర్మాతగా అందరికీ సుపరిచితుడే. మరి వీళ్ళిద్దరూ కలసి ఒక సినిమాని నిర్మిస్తున్నారంటే ఆ సినిమా ఎంత వెరైటీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాణసారథ్యం వహిస్తున్నాడు.
ఒక యువ హీరో బహుశా నాగచైతన్య (ఇంకా అఫీషియల్ గా నిర్ణయించ లేదు) నటించబోయే ఈ విభిన్న కథా చిత్రానికి ఎ.యస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తారు. ఎ.యస్.రవి కుమార్ చౌదరి చెప్పిన కథ నచ్చి అల్లు అరవింద్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



