వీడు మాస్ హీరో ఏంట్రా బాబూ..!
on Mar 11, 2015

మాస్ అంటే బస్సు పాసు కాదుబే... ఎవడు పడితే ఆడు పెట్టేసుకోవడానికి అని రవితేజ అంత క్లారిటీగా చెప్పిన తరవాత కూడా మసో... మసో అంటూ కలవరిస్తోంది కుర్రకారు. యమర్జెంటుగా మాస్ ఇమేజ్ తెచ్చేసుకొని.. ఏదో సాధించేద్దామని కుర్రకారు కలవరింతలకు గురైపోతున్నారు. ఆ లిస్టులో నాగశౌర్య కూడా చేరిపోయాడు. రెండు మూడు లవ్ స్టోరీలు చేశాడో లేదో.. ఇక చాలెహె... మనం ఎక్కువ లవ్ స్టోరీలు చేయకూడదు.. అని రిలాక్సయిపోయాడేమో.. ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం పరితపించేస్తున్నాడు. యోగి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా జాదూగాడులో మాస్ హీరోగా కొత్త ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య ఫైటింగులూ గట్రా చేసేసి, కండలు గుండెలూ చూపించేసి... మాస్ దగ్గర మార్కులు కొట్టేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు.. ఎన్టీఆర్ - మహేష్ - పవన్‌లా భారీ డైలాగులూ చెప్పబోతున్నాడట. కుర్రాడు చూడ్డానికి లేతగా, కొలకొత్తా తమలపాకులా ఉంటాడు. అప్పుడే కారాకిళ్లీలాంటి వేషాలేంటి చెప్పండి??? చూద్దాం.. ఎంత జాదూ చూపిస్తాడో..??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



