సమంతతో కలిసి క్రికెట్ ఆడనున్న నాగ చైతన్య
on Jun 21, 2018
నాగ చైతన్య, అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఏ మాయ చేసావె, 100 % లవ్, ప్రేమమ్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం నాగ చైతన్య 'సవ్యసాచి', 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలతో బిజీగా ఉన్నాడు.. వీటితోపాటు మరో రెండు సినిమాలు కూడా పట్టా లెక్కనున్నాయి.. ఒకటి వెంకటేష్ తో మల్టీస్టారర్ కాగా, రెండోది 'నిన్నుకోరి' ఫేమ్ 'శివ నిర్వాణ' దర్శకత్వంలో ఒక సినిమా.. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది.. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో సమంత హీరోయిన్.. పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంత కలయికలో వస్తున్నమొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.