'నాంది' కాంబినేషన్ లో మరో మూవీ.. పోస్టర్ అదిరింది
on Jun 27, 2022

అల్లరి నరేష్ ప్రధాన పాత్రధారిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'నాంది'. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నరేష్ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసి మంచి విజయాన్ని అందుకున్న విజయ్.. ఇప్పుడు తన రెండో సినిమాని కూడా నరేష్ తోనే చేస్తున్నాడు. తాజాగా వీరి కాంబినేషన్ లో రానున్న రెండో సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది.
నరేష్-విజయ్ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమాను 'కృష్ణార్జున యుద్ధం', 'మజిలీ', 'టక్ జగదీష్' వంటి చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ మూవీకి అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో సంకెళ్లతో బందించి ఉన్న చేతులు, తమకి స్వేచ్ఛ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఇది కూడా 'నాంది' తరహాలోనే విభిన్న కథతో రూపొందనుందని అనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 60 వ సినిమాగా రానుంది.

కాగా ప్రస్తుతం నరేష్ చేతిలో 'సభకు నమస్కారం', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



