"నా రాకుమారుడు"గా వస్తున్న నవీన్
on Jul 18, 2013
"అందాల రాక్షసి" చిత్రంతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి "నా రాకుమారుడు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ లో పి.వజ్రంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి.సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. అచ్చు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో... ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.