'న' నోనో అంటున్న యంగ్ టైగర్
on Apr 21, 2015
.jpg)
ఇండస్ట్రీలో సెంటిమెంట్ లేనివారున్నారంటే అది ప్రపంచంలో మరో వింత అని చెప్పొచ్చు.ముఖ్యంగా హీరోలకు టైటిల్ సెంటిమెంట్ ఉంటుంది. మహేశ్ బాబుకి మూడక్షరాల సెంటిమెంట్, గోపీచంద్ కి చివర్లో సున్నా సెంటిమెంట్ అయితే యంగ్ టైగర్ కి 'న' అనే అక్షరం సెంటిమెంట్ అంట. న తో నా అల్లుడు, నాగ, నరసింహుడు ఇవన్నీ అట్టర్ ఫ్లాప్. అందుకే 'న' తో టైటిల్ పెట్టకూడదని ఫిక్సైపోయాడట. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాన్నకు ప్రేమతో కి టైటిల్ మార్చమని ఒకటే గొడవ చేస్తున్నాడట. మహేశ్ వన్ తో దారుణంగా దెబ్బతిన్న సుకుమార్ కూడా ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని నాన్నకు ప్రేమతో టైటిల్ కి ముందు 'మా' అనే అక్షరం పెట్టి 'మానాన్నకు ప్రేమతో' అని ఫిక్స్ చేశాడట. అయినా కథలో మేటరుండాలి కానీ టైటిల్ ఏంటి బాసూ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా టైటిల్ మారాక సినిమా హిట్టైతే ఎన్టీఆర్ న సెంటిమెంట్ మరింత బలపడుతుందేమో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



