కబడ్డీ ప్లేయర్ `పెద్ది`గా ఎన్టీఆర్!?
on Feb 2, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వేసవి కానుకగా మార్చి 25న థియేటర్స్ లోకి రానుంది. ఈ లోపే విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నారు తారక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగనున్నాయని బజ్. ఇందులో బస్తీకి చెందిన స్టూడెంట్ లీడర్ గా తారక్ కనిపిస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే, కొరటాల శివ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగనే మరో మూవీని కూడా పట్టాలెక్కించబోతున్నారట ఎన్టీఆర్. `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఇందులో తారక్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుందని ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో కబడ్డీ ప్లేయర్ గా తారక్ దర్శనమివ్వనున్నారట. అదేవిధంగా, `పెద్ది` అనే టైటిల్ ని కన్ఫామ్ చేశారని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, తారక్ - బుచ్చిబాబు కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



