మహేష్, సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్..!!
on Aug 18, 2018

ప్రస్తుతం మహేష్ బాబు తన 25 వ సినిమా 'మహర్షి'తో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.. మహర్షి అనంతరం మహేష్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చినప్పటికీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.. అందుకే ఈసారి సుకుమార్, మహేష్ కి మంచి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.. సుకుమార్ గత సినిమా 'రంగస్థలం' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. అదే ఉత్సాహంతో సుకుమార్, మహేష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నాడట.. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.. ఈ సినిమాలో దాదాపు 30నిమిషాల నిడివితో ఓ గెస్ట్ రోల్ ఉందట.. ఈ పాత్రని ఎన్టీఆర్ తో చేయించాలని సుకుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. అదే జరిగితే 'భరత్ అనే నేను' ఆడియో ఫంక్షన్లో ఒకే వేదికపై కనిపించి కనువిందు చేసిన మహేష్, ఎన్టీఆర్.. వెండితెర మీద కలిసి నటిస్తే ప్రేక్షకులకు కనుల పండుగే అనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



