యన్ టి ఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో చిత్రం
on Jul 17, 2011
యన్ టి ఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో చిత్రం రాబోతూంద్ని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక చక్కని చిత్రం రానుందని తెలిసింది. ఇప్పటికే హీరో యన్ టి ఆర్ కి శ్రీనువైట్ల ఒక కథను చెప్పారట. ఆ పాయింట్ నచ్చటంతో దాన్ని డెవలప్ చేయమని యన్ టి ఆర్ చెప్పారట. అయితే ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దూకుడు" చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
(2).jpg)
ఈ చిత్రం పూర్తయి, రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత యన్ టి ఆర్ హీరోగా నటించబోయే సినిమాకి పనిచేస్తారని తెలిసింది. అలాగే హీరో యన్ టి ఆర్ కూడా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో "ఊసరవెల్లి" చిత్రంలోనూ, బోయపాటి శీను దర్శకత్వంలోని "చురకత్తి" చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నారు...అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రంలో కూడా యన్ టి ఆర్ హీరోగా నటించే అవకాశాలున్నాయని కూడా సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



