విజయ్ దేవరకొండ పిక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృణాల్ ఠాకూర్
on Nov 2, 2024

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్(mrunal thakur)ఆ తర్వాత నాని తో కలిసి హాయ్ నాన్న మూవీలో చేసి తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ గా మారింది.ఆ వెంటనే విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో ఫ్యామిలీ స్టార్ లోను జత కట్టి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ ని కూడా పొందింది. దిల్ రాజు బ్యానర్ లో ఏప్రిల్ 5 న విడుదలైన ఫ్యామిలీ స్టార్ ఆశించినంత విజయాన్ని అయితే అందుకోలేదు.కానీ పెర్ఫార్మెన్స్ పరంగా విజయ్,మృణాల్ లకి మంచి పేరునే తీసుకొచ్చింది.
ఫ్యామిలీ స్టార్(family star)విడుదలకి ముందు విజయ్ దేవరకొండ,మృణాల్ ల దివాలి సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్ ఒకటి రిలీజ్ అయ్యింది.అంటే ఆ పిక్ లో విజయ్ అండ్ మృణాల్ లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని టపాసులు లాంటివి కాలుస్తుంటారు.ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఆ పిక్ సినీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది. రీసెంట్ గా సౌకీన్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ వేదికగా విజయ్ ప్లేస్ లో మృణాల్ తో కలిసి టపాసులు కాలుస్తునట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. పైగా దీపావళి ఎడిటింగ్, బాలీవుడ్ నటి ఫోటో షూట్ అనే క్యాప్షన్ ని కూడా ఉంచాడు.

దీనిపై మృణాల్ సోషల్ మీడియా వేదికగా న అసహనాన్ని వ్యక్తం చేస్తూ బ్రదర్ మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు.మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారేమో, ఏ మాత్రం బాగోలేదంటూ ట్వీట్ చేసింది.చాలా మంది నెటిజెన్స్ కూడా మృణాల్ కి మద్దతుగా నిలుస్తూ అతని తీరుని తప్పుబడుతున్నారు. మృణాల్ ప్రస్తుతం పూజా మేరీ జాన్, హై జవానీ ఇష్క్ తో హౌనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 ,తుమ్ హిహో అనే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



