నా భర్త తమ్ముడు నాపై చేతబడి చేసాడు.. దేవుడి దయవల్ల బయటపడ్డాను
on Sep 10, 2025

'గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన మూవీ 'ఆదిత్య 369 '. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన ఫస్ట్ ట్రావెల్ టైమింగ్ మూవీగా కూడా నిలిచింది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నటి 'మోహిని'(Mohini). తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన మోహిని తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఎటువంటి క్యారక్టర్ ని పోషించినా సరే, సదరు క్యారక్టర్ లో మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా అనిపించడం 'మోహిని' స్పెషాలిటీ.
రీసెంట్ గా 'మోహిని' ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియచేసింది. ఆమె మాట్లాడుతు 'కన్మణి' అనే మూవీలో స్విమ్మింగ్ పూల్ సీన్‌లో బలవంతంగా సగం దుస్తులు వేసి నటించమన్నారు. ఈత రాదని ఏడ్చినా వినలేదు. ముత్తు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాల్లో అవకాశాలు చేజారిపోయాయి. నా భర్త కజిన్ నాపై చేతబడి చేసాడు. భగవంతుడి దయతో బయటపడ్డానని పేర్కొంది. ప్రస్తుతం మోహిని మాటలు వైరల్ గా నిలిచాయి.క్యారక్టర్ నటిగాను మోహిని తన సత్తా చాటింది. వరుస ప్లాప్ ల్లో ఉన్న 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన 'హిట్లర్' లోచిరంజీవి చెల్లెలుగా ధీటైన నటననే ప్రదర్శించడమే ఒక ఉదాహరణ. కెరీర్ పీక్ లో ఉన్నపుడే భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా(America)లో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకి భరత్ నుంచి విడాకులు తీసుకుంది. 2006 లో క్రైస్తవం స్వీకరించి ఆమెరికాలోనే ఉంటూ క్రైస్తవ మత ప్రచారకురాలిగా తన సేవలందిస్తుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు. 100కి పైగా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



