100 కిలోల బరువుతో మోహల్ లాల్.. వీడియో వైరల్
on Jul 26, 2023

ఇండియన్ సినిమాల్లో మలయాళ యాక్టర్ మోహన్ లాల్‌కు ఉన్న గుర్తింపే వేరు. కంప్లీట్ యాక్టర్‌గా ఇటు సౌత్‌లోనూ, అటు నార్త్‌లోనూ ఆయనకు క్రేజ్ ఉంది. హీరోగా, కీలక పాత్రధారిగా ఇలా ఏ పాత్ర చేసినా ఆయన తనదైన స్టైల్‌ను చూపిస్తుంటారు. నటన పరంగా కాకుండా మరో విషయంలో మోహన్ లాల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అదే ఆయన లుక్. ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇదెలా సాధ్యం అనుకుంటే మాత్రం తప్పవుతుంది. ఎందుకంటే దీని కోసం మోహన్ లాల్ తెగ కష్టపడుతుంటారు. ఆహారం విషయంలోనే కాదు.. ఫిట్‌నెస్ విషయంలోనూ మోహన్ లాల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతుంటారు.
తాజాగా మోహన్ లాల్ జిమ్ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందుకు కారణం.. 63 ఏళ్ల వయసులోనూ ఆయన ఏకంగా 100 కిలోల బరువును ఎత్తుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేయగా ఫ్యాన్స్, నెటిజన్స్ ఆయన కమిట్‌మెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ వయసులో ఆయనకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ.. మోహన్ లాల్ ఫిట్‌నెస్ విషయంలో కాంప్రమైజ్ కావటం లేదు.
ఇప్పుడు మోహన్ లాల్ రామ్, బారోజ్, మలైకోటై వాలిబన్ సినిమాలతో పాటు రీసెంట్‌గా వృషభ అనే పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేశారు. మోహన్ లాల్ కెరీర్‌లోనే ఇదే భారీ బడ్జెట్ మూవీ అని అంటున్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా నటిస్తుండటం విశేషం. రీసెంట్‌గానే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగులో జనతాగ్యారేజ్ సినిమా తర్వాత మరో సినిమాలో ఆయన నటించలేదు. ఆయన నటించిన మలయాళ చిత్రాలు ఓటీటీ పుణ్యమాని తెలుగులోకి అనువాద రూపంలో ఆడియెన్స్‌కు అందుబాటులోకి వచ్చి అలరిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



