మోహన్ లాల్ కి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆనందంలో అభిమానులు
on Sep 20, 2025

దక్షిణ భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'మోహన్ లాల్'(Mohanlal).నాలుగున్నర దశాబ్దాల క్రితం సినీ రంగ ప్రవేశం చేసి, మొన్న 'ఆగస్టు 'లో వచ్చిన 'హృదయపూర్వం' వరకు తన హవాని కొనసాగిస్తు వస్తున్నాడు. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించే మోహన్ లాల్ కి మలయాళ చిత్ర పరిశ్రమ తో పాటు వివిధ భాషల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
రీసెంట్ గా మోహన్ లాల్ కి కేంద్ర ప్రభుత్వం 2023 వ సంవత్సరానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'దాదాసాహెబ్ ఫాల్కే'(Dadasaheb Phalke)అవార్డుని ప్రకటించింది. ఈ నెల 23 న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుని అందుకోనున్నాడు. దీంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉండగా, గతంలో మోహన్‌లాల్‌కి పద్మశ్రీ, పద్మభూషన్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ని భారత ప్రభుత్వం 1969 వ సంవత్సరంలో ప్రవేశ పెట్టి కళా రంగంలో సుదీర్ఘ కాలం నుంచి విశేష సేవలందిస్తున్న వారికి ఇస్తు వస్తుంది. కళాకారులు ఆ అవార్డుని అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తారు.
మోహన్ లాల్ ఇప్పటి వరకు సుమారు 350 చిత్రాల వరకు సిల్వర్ స్క్రీన్ పై కనపడ్డాడు. ప్రస్తుతం భభభ, వృషభం, దృశ్యం పార్ట్ 3 వంటి చిత్రాలు చేస్తున్నాడు.మలయాళంతో సహా ఐదు భాషలకి చెందిన చిత్రాల్లో నటించిన రికార్డు మోహన్‌లాల్ సొంతం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



