కలెక్షన్ కింగ్ పుస్తకం రాస్తున్నారా?
on Nov 22, 2014
.jpg)
మోహన్‌బాబు అంటేనే సంచలనాలకు మారు పేరు. క్రమశిక్షణ విషయంలో ఆయన తరావే ఎవరైనా! ఎన్టీఆర్ తరవాత అంత గొప్పగా డైలాగులు చెప్పేదెవరంటే నిస్సందేహాంగా మోహన్‌బాబు అనొచ్చు. వెండి తెరపైనా, నిజ జీవితంలోనూ ఆయన ప్రకంపనాలు సృష్టించారు. ఇప్పుడు మరో సంచలనానికి తెర లెపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన త్వరలోనే తన జీవిత కథ రాసుకోబోతున్నట్టు సమాచారం. నలభై ఏళ్ల సినీ జీవితంలో తనకు ఎదురైన సంఘటనలు, ఎక్కి వచ్చిన మెట్లు, సాధించిన విజయాలు... వీటిన్నింటికీ అక్షర రూపం ఇవ్వబోతున్నారట. అంతేకాదు సినీ పరిశ్రమలోని కుట్రలు, కుతంత్రలు, పెద్ద మనుషుల భాగోతాలూ... ఇవన్నీ అక్షర బద్దం చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది తన పుట్టిన రోజుకి ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ పుస్తకానికి సంబంధించిన ప్రాజెక్టు.. మంచు విష్ణు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. వేదికపై, ఎలాంటి మోహమాటం లేకుండా, ఎదుటివారిపై సెటైర్లు వేసే కలెక్షన్ కింగ్... అక్షరాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



