జూనియర్ యన్.టి.ఆర్. బెస్ట్ - మోహన్ బాబు
on Feb 7, 2012
జూనియర్ యన్.టి.ఆర్. బెస్ట్ అని మోహన్ బాబు అన్నారు. వివరాల్లోకి వెళితే సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువు కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు ఏ విషయం గురించి మాట్లాడినా ముక్కుకు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలా ఆయన ఈ మధ్య ఒక సందర్భంలో ప్రస్తుతమున్న యువ హీరోల్లో నటనలో కానీ, డ్యాన్సులో కానీ, డైలాగ్ మాడ్యులేషన్ లో కానీ అందరికంటే జూనియర్ యన్.టి.ఆర్. బెస్ట్ అని వ్యాఖ్యానించారు.
ఆయన అంతటితో ఆగకుండా ఇప్పుడున్న యువహీరోలు అతన్ని చేరుకోవాలంటే మరో అయిదేళ్ళు పడుతుందనీ, వారిలో తన కుమారులు విష్ణువర్థన్, మనోజ్ కుమార్ కూడా ఉన్నారనీ అన్నారు. ఇది జూనియర్ యన్.టి.ఆర్.కి ఆనందం కలిగించే విషయమే అయినా మిగిలిన యువ హీరోలకు మాత్రం ఎక్కడో కాలుద్ది కదా...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



