అగ్ర దర్శకుడు బాలచంద్ర ఫోన్ లో బూతు చిత్రాలు చూడమన్నాడు
on Sep 30, 2024

ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రముఖ పాత, కొత్త నటీమణులే స్వయంగా మీడియా ముందుకొచ్చి వెల్లడి చెయ్యడంతో దేశ వ్యాప్తంగా కూడా ఈ విషయం సంచలనం సృష్టించింది. కొంత మంది నటీమణులు అయితే లైంగిక వేధింపులు పడలేక మలయాళ చిత్ర పరిశ్రమని వదిలేసి తమిళ సినిమా రంగంలో చేస్తున్నారు.
ఆ కోవకే చెందిన ప్రముఖ నటి మిను మునీర్(minu munner)ప్రముఖ హీరో జయసూర్య తనని లైంగికంగా వేధించాడని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా మరో సంచలన ఆరోపణ చేసింది. ప్రముఖ దర్శకుడు బాలచంద్ర మీనన్(balachandra menon)సైతం తనని లైంగికంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 2007 లో ఒక గదికి పిలిపించుకున్న బాల చంద్ర ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూడాలని ఫోర్స్ చెయ్యడంతో పాటుగా నాకు తోడుగా గదిలోనే ఉండాలని కోరాడని, కానీ నేను అక్కడ ఉండకుండా వెంటనే బయటకి వచ్చేసానని చెప్పింది.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో బాలచంద్ర మీనన్ కూడా ఒకరు.1987లో వచ్చిన అచ్చువెట్టంటేతో మొదలుకొని ముగం అభిముగం,సామంతరంగల్, 18 ఏప్రిల్, 19 ఏప్రిల్,నిన్నయ్ ఎంతిను కొల్లం, ఇలా సుమారు నలభై చిత్రాల దాకా దర్శకత్వం వహించాడు. నటుడు గా కూడా చాలా చిత్రాల్లో చేసిన బాలచంద్ర గత సంవత్సరం రిలీజైన ఏ రంజిత్ సినిమా,పులిమడ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



