'విమానం'తో మీరా జాస్మిన్ రీఎంట్రీ
on Feb 15, 2023

మీరా జాస్మిన్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె 'విమానం' అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతుంది.
'అమ్మాయి బాగుంది' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మీరా జాస్మిన్ 'భద్ర', 'గుడుంబా శంకర్', 'గోరింటాకు' వంటి సినిమాల్లో నటించి అలరించింది. చివరిగా ఆమె నటించిన తెలుగు సినిమా 2013 విడుదలైన 'మోక్ష'. దాదాపు అన్ని సౌత్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొంతకాలంగా మలయాళంకే పరిమితమైంది. అది కూడా ఒకటి అరా సినిమాలే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలి అనుకుంటుంది. నేడు(ఫిబ్రవరి 15) మీరా జాస్మిన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

జీ స్టూడియోస్, కేకే క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం 'విమానం'. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈరోజు మీరా జాస్మిన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో మీరా జాస్మిన్ లుక్ ఆకట్టుకుంటోంది. మరి ఈఎంట్రీ ఆమెకు ఎలా కలిసొస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



