దిల్ రాజు చేతుల మీదుగా 'మెకానిక్' మోషన్ పోస్టర్!
on Feb 17, 2023

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా(ఎమ్.నాగమునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్, నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మతలుగా రూపొందుతున్న చిత్రం 'మెకానిక్'. 'ట్రబుల్ షూటర్' అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.
మణిసాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా హీరోయిన్. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు.
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ఎస్.వి.శివరాం, ఎడిటర్ గా శివ శర్వాణి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



