కాంతార చాప్టర్ 1 మేకర్స్ తో మారుతి మూవీ !..అణు విస్ఫోటనం పక్కా
on Jan 31, 2026

-కేజిఎఫ్ , కాంతార లని మించి ఉంటుందా!
-మారుతి టీం పూర్తి వివరణ
-రాజా సాబ్ ఫలితంపై నిందలు పోతాయి
సౌత్ సిల్వర్ స్క్రీన్ వద్ద తిష్ట వేసుకొని కూర్చున్న నిశ్శబ్దాన్ని ఒక మూలన పడేస్తూ, అణుబాంబు లాంటి విస్ఫోటనాన్ని కలిగించే సినిమాలతో నిశ్శబ్దానికి భయాన్ని పరిచయం చేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్(Hombale Films).కేజిఎఫ్ సిరీస్, సలార్,కాంతార సిరీస్ లే అందుకు సజీవ సాక్ష్యం. బడా హీరోలు, దర్శకులు సైతం హోంబలే లో సినిమా చేస్తే తమ జాతకం మారిపోతుందని అనుకోవడం సౌత్ సినీ సర్కిల్స్ లో నిత్యం వినిపించే మాట. మరి అంతటి ప్రెస్టేజియస్ట్ బ్యానర్ లో రాజాసాబ్ ఫేమ్ మారుతీ(Maruthi)దర్శకుడు గా భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో మారుతీ టీం తన స్పందనని తెలియచేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
మారుతీ ప్రస్థుతానికి ఎలాంటి సినిమాకి కమిట్ అవ్వలేదు. హోంబులే ఫిలిమ్స్ లో చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్ అని తేల్చిపడేసింది.రాజా సాబ్ విషయంలో మేకింగ్ పరంగా మారుతీ కి మంచి పేరు వచ్చింది. కానీ ఆకట్టుకోలేని కథనాలు, ప్రభాస్ కట్ అవుట్ కి తగ్గ క్యారక్టర్ కాకపోవడం, అంచనాలని రీచ్ కాకపోవడం వల్లే రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని చవి చూడాల్సి వచ్చింది. సదరు ఫలితానికి మారుతీ నే కారణమంటు సోషల్ మీడియా వేదికగా కొంత మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
Also read: 19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు
హోంబులే ఫిలిమ్స్ విషయానికి వస్తే కాంతార చాప్టర్ 1 తో భారీ సక్సెస్ అందుకొని మళ్ళీ రిషబ్ శెట్టి(Rishab shetty)తోనే 'రిచర్డ్ అంథోని, ప్రభాస్(Prabhas)తో సలార్ పార్ట్ 2 ని లూప్ లైన్ లో ఉంచింది. ఈ రెండు చిత్రాలని తమ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



