రిలేషన్స్ నా జీవితాన్ని నాశనం చేసాయి.. శక్తి వృధా అయ్యింది
on Aug 23, 2025

భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'మనీషా కొయిరాలా'(Manisha Koirala). 90 వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మనీషా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. క్రిమినల్, భారతీయుడు, బొంబాయి, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయిన మనీషా, 2012 లో కాన్సర్(Cancer)బారిన పడింది. కొన్ని సంవత్సరాల పాటు కాన్సర్ తో పోరాడి మళ్ళీ సినిమాల్లో రి ఎంట్రీ ఇచ్చింది.
రీసెంట్ గా మనీషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నా జీవితంలో రిలేషన్ షిప్స్ కారణంగా ఎక్కువ సమయం, శక్తి వృధా అయ్యింది. మనిషి జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఉండటం సహజం. కానీ రిలేషన్ వల్ల అనారోగ్య ప్రభావాలు ఎదుర్కోవడంతో, వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను. ఇలాగే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. స్వతంత్రంగా జీవించడం గొప్ప అనుభవమని మనీషా చెప్పుకొచ్చింది.
నానాపటేకర్, విషేక్ ముష్రాన్, 'ఆర్యన్ వెడ్' తో పాటు పలు హాలీవుడ్ నటులతో మనీషా రిలేషన్ లో ఉన్నట్టుగా 'గాసిప్స్' వినిపించాయి. 2010 లో నేపాల్ కి చెందిన వ్యాపార వేత్త 'సామ్రాట్ దహల్'(Samrat Dahal)తో వివాహం జరగగా, రెండు సంవత్సరాలకే మనీషా విడిపోయింది. 1991 లో సినీ రంగ ప్రవేశం చేసిన మనీషా తన కెరీర్ లో ఇప్పటివరకు సుమారు 70 చిత్రాల వరకు చేసింది. 2023 లో వచ్చిన 'షెహ్ దాజా' తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



