100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్ ప్రధానిని కలిసిన మనీషా కొయిరాలా
on May 22, 2024

తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో.. నాగార్జున (nagarjuna) హీరోగా వచ్చిన క్రిమినల్ లోని ఈ పాట మారుమోగిపోతున్నంత కాలం మనీషా కొయిరాల( maisha koirala)ని ఎవరు మర్చిపోరు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నటించి రెండు చోట్ల అశేష అభిమానులని సంపాదించుకుంది. 90 వ దశకంలో ఆమె అందానికి, నటనకి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. ఫస్ట్ లవ్ లెటర్, అన్మోల్, ధన్వన్, మిలాన్, 1942 లవ్ స్టోరీ, క్రిమినల్, బొంబాయి, భారతీయుడు,ఖామోషి,దిల్ సే, అన్వర్, జై హింద్, మార్కెట్, నగరం, ఖేలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. రీసెంట్ గా ఆమె బ్రిటన్ ప్రధాన మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది
యు కే ...యునైటెడ్ స్టేట్స్ అఫ్ కింగ్ డం. బ్రిటన్ (britan)క్యాపిటల్ గా ఉంటుంది. మన పొరుగునే ఉన్న నేపాల్ దేశానికీ బ్రిటన్ కి మధ్య ఏర్పడిన బంధానికి వంద ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే ఆ రెండు దేశాలు పరస్పర ఒప్పందంతో వంద సంవత్సరాలుగా కలిసి వెళ్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని రిషి సునాక్ (rishi sunak)నివాసంలో వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకి హాజరు కావాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వం మనీషా కొయిరాలకి ఆహ్వానం వచ్చింది. దీంతో నేపాల్ తరుపున మనిషా హాజరయ్యింది.. ఆద్యంతం ఎంతో వైభవం గా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని తో కలిసి దిగిన ఫోటోలని మనీషా తన ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేసింది. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రధానిని నేపాల్ లోని ఎవరెస్టు ట్రెక్కింగ్ కి హాజరవ్వాలని కోరినట్టుగా కూడా తెలిపింది. ఫంక్షన్ కి వచ్చిన అతిధులు హీరామండి చూశామని చెప్పి తనని మెచ్చుకున్నారని కూడా చెప్పింది

మనీషా కొయిరాలా నేపాల్ కి చెందిన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి . ఆమె తాత బిశ్వేశ్వర ప్రసాద్ 1959 లో ప్రధాన మంత్రిగా పని చేసాడు. ఆమె తండ్రి పేరు ప్రకాష్ కొయిరాలా. ఆయన కూడా సుదీర్ఘ కాలం రాజకీయనాయకుడుగా కొనసాగాడు. ఇక మనీషా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రీసెంట్ గా హీరామండి (heeramandi)లో చేసింది.మల్లికా జాన్ అనే వేశ్య పాత్రలో అధ్బుతంగా నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



