వైరల్ గా మారిన మొదటి టికెట్ రేటు.. కొన్న లెజండ్ ఎవరో తెలుసా
on Jan 6, 2026
.webp)
-సంచలనం సృష్టిస్తున్న మన శంకర వర ప్రసాద్
-ఫస్ట్ టికెట్ కి భారీ రేటు
-కొన్నది ఈ లెజండ్ నే
తెలుగు సినీ గ్లోబల్ మార్కెట్ 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana shankara varaprasad garu)ద్వారా మరోసారి చిరంజీవి మ్యానియాతో కళకళలాడనుంది. రిలీజ్ డేట్ జనవరి 12 కి కౌంట్ డౌన్ కూడా మొదలవ్వడంతో అభిమానుల్లో తమ బాస్ ని చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో చూడబోతున్నామనే ఆనందం వాళ్ల ముఖాల్లో కనపడుతుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తున్నా , మాస్ అంశాల్ని కూడా బ్యాలన్స్ చేస్తూ పర్ఫెక్ట్ చిరంజీవి సినిమాగా అనిల్ రావిపూడి తీర్చిదిద్దినట్టుగా కనపడుతుంది.
చిరంజీవి సినిమాకి టికెట్స్ సంపాదించే విషయంలో అభిమానుల్లో సుమారు వారం ముందు నుంచే హడావిడి ఉండటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. సదరు టికెట్స్ విషయంలో పోటీ కూడా ఉండటంతో పాటు ముందు టికెట్ తమకే దక్కాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన నగరమైన అమలాపురం పట్టణానికి చెందిన వెంకటరమణ థియేటర్ లో మొదటి టికెట్ కి సంబంధించి వేలం జరిగింది. సదరు వేలంలో మెగా అభిమాని వెంకట సుబ్బారావు లక్ష పదకొండు వేల రూపాయలకి కొనుగోలు చేసి
మొదటి టికెట్ ని దక్కించుకున్నాడు.
Also read: రెహ్మాన్ కి షాక్ ఇచ్చిన పెద్ది టీం.. సంగీత తుఫాన్ మరింత డబుల్
బుక్ మై షో తో పాటు మరికొన్ని యాప్ లలో కొన్ని ఏరియాలకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఫాస్ట్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. రేపు హైదరాబాద్(HYderabad)లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరగబోతుంది. విక్టరీ వెంకటేష్(Venkatesh)కూడా కీలకమైన క్యారక్టర్ లో చేస్తు ఒకే టికెట్ పై డబుల్ ధమాకా ని అభిమానులకి, ప్రేక్షకులకి అందిస్తున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



